ప్రకాశం: చంద్రశేఖరపురంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కేటాయించిన ఎలక్ట్రానిక్ ఆటోను బుధవారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఎలక్ట్రానిక్ ఆటోలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.