AP: రాజధాని అమరావతి కోసం మంత్రి నారాయణ వడ్డమానులో 2వ విడత భూసమీకరణ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో రైతుల నుంచి అధికారులు భూసమీకరణ అంగీకార పత్రాలను స్వీకరిస్తున్నారు. కాగా విమానాశ్రయం, క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వేట్రాక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం ప్రభుత్వం రెండో విడతలో తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలోని 7 గ్రామాల నుంచి 16,666.57 ఎకరాలను సమీకరించనుంది.