MNCL: మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ స్కూల్ మైదానంలో వాకర్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కార్కూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా సంఘం శ్రీధర్, కోశాధికారిగా బద్రు బాయ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాకర్ క్లబ్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు సమాజ సేవలో ముందుంటామని తెలిపారు.