TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి PS నుంచి పరారైన అంతర్రాష్ట్ర దొంగ తెలుగు నాగిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. పలు చోరీల్లో నిందితుడిగా ఉన్నాడు. కల్వకుర్తి పీఎస్‌లోనూ కేసులు ఉండటంతో నాగిరెడ్డిని గతేడాది నవంబర్ 11న కల్వకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే నెల 13న రాత్రి పరారయ్యాడు. నిన్న రాత్రి నాగిరెడ్డిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు.