KRNL: దేవనకొండ మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు ప్రధాన రహదారిపై ఇరువైపులా పేరుకుపోయిన మట్టి, ముళ్లకంపలను వెంటనే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కే.భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీడీవో, ఎంపీడీవోలను కలిసి వినతిపత్రం అందజేశారు. మట్టి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.