MLG: మేడారం మహా జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి షిఫ్ట్‌లో జరుగుతున్న క్యూలైన్, ఆలయ పునరుద్ధరణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వెంకటేష్, ఆర్అండ్బి ఈఈ సురేష్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ ఉన్నారు.