AKP: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు సోమవారం అనకాపల్లి జీవీఎంసీ కార్యాలయం వాహనాల పార్కు గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. చెత్త సేకరణ వాహనాలు బయటకు వెళ్లకుండా బైఠాయించారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు జి.శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటే పారిశుధ్య కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.