KNR: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైపాస్ రోడ్డులో తనిఖీలు చేస్తుండగా బొమ్మకల్ వైపు వెళ్తున్న రామగుండంకు చెందిన సాయి వర్షిత్, కరీంనగర్‌కు చెందిన విద్యార్థులు సాయి కార్తీక్, సాయితేజలను ఎస్సై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరకు నుంచి తెచ్చిన గంజాయిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు.