భవిష్యత్తులో రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌కు పూర్తి భద్రత కల్పించేందుకు అమెరికా తొలిసారి అంగీకరించింది. పారిస్‌లో జరిగిన ఉక్రెయిన్ భాగస్వాముల సదస్సులో ఈ మేరకు కీలక ముందడుగు పడింది. ఈ సమావేశానికి US తరఫున స్టీవ్ విట్కాఫ్తో పాటు ఇతర ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. యుద్ధ మేఘాల మధ్య అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.