TG: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు మహబూబ్నగర్ జిల్లా ఫర్దిపూర్ వాసులుగా తెలుస్తోంది. ఉజ్జయిని పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.