JGL: కథలాపూర్ మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అన్నారపు నర్సయ్య మంగళవారం ఎన్నికయ్యారు. మండలంలోని 11 మంది ఉపసర్పంచులు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఉపాధ్యక్షురాలిగా చెన్నవేని సుజాత ఎన్నికయ్యారు. పంచాయతీల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమపై నమ్మకంతో ఎన్నుకున్న ఉపసర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు.