SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పదవి విరమణ పొందిన ప్రధాన అర్చకుడు అప్పాల భీమా శంకర్ శర్మ మృతి చెందారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. ఆలయానికి వచ్చిన ఎంతోమంది ప్రముఖులకు అప్పాల భీమశంకర్ శర్మ ఆశీర్వచనం చేశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.