JN: పాలకుర్తి మండలంలోని శాతపురం గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మండల పశువైద్యాధికారి అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకం దారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.