జనగామ జిల్లాకు జాతీయ గుర్తింపు తెచ్చిన తైక్వాండో విద్యార్థులను కలెక్టర్ రిజ్వాన్ పాషా అభినందించారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో విద్యార్థులు పాల్గొని అద్భుత ప్రదర్శన చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. జిల్లా నుంచి 20 మంది విద్యార్థులు రికార్డు సాధించారు.