ADB: మావల మండలం వాఘాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కోలంగూడలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా తనవంతుగా కృషి చేస్తానన్నారు. మండల కాంగ్రెస్ నాయకులు, యువకులు తదితరులున్నారు.