SRD: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్సై మహేష్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం సిర్గాపూర్ శివాజీలో ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన ప్రతిజ్ఞ చేశారు. ప్రతీ రోజు రోడ్డు నిబంధనలు పాటిస్తూ సంవత్సరాంతం ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ప్రజలు, వాహన దారులు, డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు.