ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని ఎస్టేట్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా జల్లెడ పట్టి, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 24 బైకులను సీజ్ చేశారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు.