ATP: గుత్తిలో స్థలం వివాదంలో తలపడిన టీడీపీకి చెందిన రెండు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాసు, గోవర్ధన్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై ఎస్సై సురేష్ విచారణ చేపట్టారు. పరస్పర ఫిర్యాదుల మేరకు గోవర్ధన్ వర్గానికి చెందిన 37 మందిపై, వాసు వర్గానికి చెందిన నలుగురిపై గురువారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.