NRPT: మాగనూర్ మండలం కొల్పూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. వాటర్ ట్యాంక్ పై పెచ్చులూడి ట్యాంక్ అడుగు భాగంలో పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అంటున్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ట్యాంకును పునర్నిర్మించి తమకు పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.