KNR: సైబర్ నేరాల పట్ల మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ రమేష్ సూచించారు. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ మోసాలు, సైబర్ స్టాకింగ్‌పై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.