JGL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఉల్లాష్ పథకంలో భాగంగా గ్రామీణ, పట్టణాల్లో మహిళా సంఘాల సభ్యులకు చదవడం, రాయడం నేర్చుకోవడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ‘అమ్మకు అక్షర మాల’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు చదవడం, రాయడం నేర్చుకొని అందరికి ఆదర్శంగా నిలువాలన్నారు.