తిరుమలలో ఆఫ్లైన్లో ఇస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల జారీపై TTD కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ కింద ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రేపటితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనుండగా.. 9 నుంచి ఆన్లైన్లో జారీ చేయనుంది. భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.