నిజామాబాదు జిల్లాలో యూరియా తిప్పలు రైతులు తీవ్ర స్థాయిలో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ముప్కాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ గిడ్డంగి వద్ద రైతులు యూరియా కొరకు రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు క్యూ లైన్ల్లో చెప్పులు, రాళ్లు, ఆధార్ కార్డులు పెట్టి ఏదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని యూరియాను సరఫరా చేయాలని వారు కొరుతున్నారు.