MDK: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైన ఘటన చేగుంట మండలంలోని పొలంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిస్టాపురం పెంటవ్వ(62) ఈనెల 6న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుమారుడు నరసింహులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.