MBNR: దేవరకద్ర MLA జి. మధుసూదన్ రెడ్డి బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పర్యటన పేరుతో BRS మాజీ MLAలు విహారయాత్ర చేశారని ఆరోపించారు. గత BRS పాలనలో కృష్ణా గోదావరి నది జలాల విషయంలో TGకు తీరని నష్టం కలిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటి రంగంపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైతే సమాధానం చెప్పలేక BRS నేతలు భయపడ్డారని పేర్కొన్నారు.