NGKL: దత్తారం ప్రభుత్వ పాఠశాలను ఎంఈఓ బషీర్ అహ్మద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యంగా అందించాలని ఉపాధ్యా యులను ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు పలు సూచనలు చేశారు.