కృష్ణా: గన్నవరంలో ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డ ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. K.రత్నమాలిక్ తనను మీడియా ప్రతినిధినిగా పరిచయం చేసుకొని విమానాశ్రయంలోని ఓ ట్రావెల్స్ సంస్థ యాజమానిని సంప్రదించాడు. పండగ సాకుతో నగదు కోరుతూ, ఇవ్వకపోతే వ్యాపారానికి ఇబ్బందులు కలిగిస్తానని హెచ్చరించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.