ADB: భోరాజ్ మండలం తర్ణం గ్రామంలో బాజీరావు మహరాజ్ సప్తాహ వేడుకలు గురువారం ముగిశాయి. ముగింపు సందర్భంగా నివృత్తి, జ్ఞానేశ్వరి, సోపాన్, ముక్తాబాయి చిన్నారుల వేషధారణతో ఎడ్ల బండిపై పురవీధుల గుండా భజన చేశారు. డప్పుచప్పుళ్ల మధ్య పల్లకీ శోభాయాత్ర చేపట్టారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.