WGL: నల్లబెల్లి GP లో నిన్న రాత్రి మిషన్ భగీరథకు రికార్డులను ఏసీ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో ప్రజలకు మంచి నీరు అందించాలని సిబ్బందికి సూచించారు. మిషన్ భగీరథ రికార్డులో తప్పిదాలు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.