కోనసీమ: ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కార్యాచరణ చేపట్టామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. పొన్నమండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను గురువారం టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్యతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.