NGKL: అచ్చంపేట 132/33 కేవీ సబ్స్టేషన్లో శుక్రవారం నిర్వహించనున్న మరమ్మతుల కారణంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీ తెలిపారు. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు లింగాల, బల్మూర్ మండలాలతో పాటు అచ్చంపేట మండలంలోని ఐనోల్, మన్నేవారిపల్లి, పల్కపల్లి సబ్స్టేషన్ల పరిధిలో సరఫరా ఉండదని పేర్కొన్నారు.