BPT: హిట్ అండ్ రన్ ప్రమాద బాధితులకు పరిహారం మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని గురువారం కలెక్టర్ డా. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వాహనం ఆచూకీ తెలియని కేసుల్లో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఆయన తెలిపారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు