WPLలో ఇప్పటివరకు 3 సీజన్లు జరిగాయి. హర్మన్ నేతృత్వంలో MI 2 సార్లు(2023, 25) ట్రోఫీ అందుకోగా.. స్మృతి సారథ్యంలో RCB ఓ సారి(2024) టోర్నీ విజేతగా నిలిచింది. ఈ సీజన్లలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరినా టైటిల్ను ముద్దాడలేకపోయింది. ఇక అత్యధిక రన్స్ (స్కీవర్ బ్రంట్- 1027), అత్యధిక వికెట్ల(హేలీ మాథ్యూస్- 41) రికార్డ్ MI ప్లేయర్ల పేరిటనే ఉంది.