AP: డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. పండుగ వేళ పవన్ రాకతో పిఠాపురంలో కోలాహలం నెలకొంది. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.