ATP: సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సంస్థ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈనెల 9 నుంచి 16 వరకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి నగరాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పండగకు ముందు 39, తర్వాత 38 బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని అధికారులు తెలిపారు.