NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 14, 15వ వార్డులకు సంబంధించి, బుచ్చి రిజిస్టార్ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.