సత్యసాయి: తనకల్లు ఎస్సై గోపిని వీఆర్‌కు పంపుతూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఈశ్వరప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనలో విధి నిర్వహణలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఎస్పీ విచారణ జరిపి ఎస్సైను బదిలీ చేసినట్లు డీఎస్పీ శివనారాయణ తెలిపారు.