పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు దీదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఢీల్లీలో టీఎంసీ ఎంపీల అరెస్ట్‌ను ఖండించారు. మరోవైపు ఐప్యాక్ సంస్థలో ఈడీ దాడులపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం నిరసనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.