KMM: ముదిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఐదుగురు వ్యక్తులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. సీఐ మురళి ఆదేశాల మేరకు ఎస్సైలు హరిత, కృష్ణ ప్రసాద్ CE1R పోర్టల్ సహాయంతో ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను శుక్రవారం బాధితులకు అందజేయగా వారు హర్షం వ్యక్తం చేశారు.