AP: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘సూపర్ సిక్స్ కింద ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం. ధాన్యం రైతులకు 24 గంటల్లోనే నగదు ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు అధిగమించి మరీ మెగా డీఎస్సీ పూర్తి చేశాం. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని.. ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు’ అని పేర్కొన్నారు.