AP: పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘2019లో టీడీపీ ఓడిపోయి ఉండకపోతే 2021లోనే ప్రాజెక్ట్ పూర్తయ్యేది. నాకు గొడవలు వద్దు.. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడు కూడా మమ్మల్ని ఇదే రకంగా విమర్శించారు’ అని పేర్కొన్నారు.