TG: సైబర్ నేరాల బాధితుల కోసం హైదరాబాద్ పోలీసులు నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘సైబర్ మిత్ర’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఇది దేశంలోనే మొదటిదన్నారు. ఎవరైనా సైబర్ పద్ధతిలో మోసపోతే.. తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఏఐతో వర్చువల్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దానితో సైబర్ నేరాలను అరికట్టడానికి అవకాశం ఉందన్నారు.