కర్నూలు ఎన్ఆర్పేటలోని నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సంక్రాంతి తర్వాత వెంకటరమణ కాలనీలోని ప్రైడ్ ప్లాజాకు తరలించనున్నట్లు కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. నూతన భవన నిర్మాణం కొనసాగుతున్నందున మార్పు చేపట్టామని, రూ. 85 లక్షల వ్యయంతో పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు.