KMM:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు బారుగూడెం, గొల్లగూడెం, నాయుడుపేట, నడిమితండా, జలగంనగర్, ఆటో నగర్ ప్రాంతాల్లో పర్యటించి, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.