మలేసియా ఓపెన్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీ.వీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నెం. 2 ప్లేయర్, చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో 16-21, 15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండు గేముల్లోనూ ఒక దశలో ఆధిక్యంలో నిలిచినప్పటికీ, కీలక సమయాల్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో సింధుకు నిరాశ తప్పలేదు.