కృష్ణా: మోపిదేవి మండలం కొత్తపాలెం శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై గౌతమ్ కుమార్ నిన్న పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు వద్ద నుంచి రూ.10,500 నగదు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.