AP: అధికారంలో ఉండగా భగవంతుడితో ఆటలాడినందుకే వైసీపీకి ఈ గతి పట్టిందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. దేవుడిపై భక్తి లేకుండా ప్రవర్తిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీటీడీపై కుట్రలు పన్నుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి జగన్ దుర్మార్గానికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు.