కొత్త పాయింట్ చెప్పినప్పుడు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడానికి సమయం పడుతుందని దర్శకుడు మారుతి చెప్పాడు. ‘రాజాసాబ్’ సక్సెస్ మీట్లో ఆయన.. రెబల్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసి డిజప్పాయింట్ కాలేదు.. అలాగని పూర్తిగా సాటిస్ఫై కాలేదన్నాడు. చివరి 40 నిమిషాలు అందరికీ నచ్చిందని తెలిపాడు. ఒక్క షో, ఒక్కరోజులోనే ఫలితం డిసైడ్ చేయకూడదని, 10రోజులు ఆగితే ఈ సినిమా ఏంటో తెలుస్తుందన్నాడు.