AP: విజయవాడ దుర్గగుడిలో మరో వివాదం తలెత్తింది. శుక్రవారం శ్రీచక్ర అర్చనలో వినియోగించేందుకు తెచ్చిన పాలపై దుమారం రేగింది. ఆవుపాలలో పురుగులు కనిపించడంతో అర్చన నిలిపివేశారు. టెట్రాప్యాక్ పాలలో పురుగు అంశంపై ఆలయ ఈవో విచారణకు ఆదేశించారు. నిజ నిర్ధారణ చేసి నివేదిక సమర్పించాలని వైదిక కమిటీకి బాధ్యతలు అప్పగించారు.