‘రాజాసాబ్’ సక్సెస్ మీట్లో దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. కొత్తగా 8 నిమిషాల సన్నివేశాలను ఈ మూవీలో యాడ్ చేస్తున్నామని తెలిపాడు. ఇవాళ సాయంత్రం 6 గంటల షోలలో ఈ సీన్స్ వస్తాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ అందులో ఉంటుందన్నాడు.